Agriculture

మామిడి రైతుల పాలిట యమపాశం…లాక్‌డౌన్

Coronavirus Lock Down Ruins Mango Farmers Lives

ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు కరోనా రక్కసి విస్తరిస్తుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగింపు వెరసి ఉత్తరప్రదేశ్‌లో మామిడి రైతు విలవిల్లాడుతున్నాడు. మలిహాబాద్‌లో మమాడి తోటల రైతుల పరిస్థితి దయనీంగా మారింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల కారణంగా పూత, పిందెలు రాలిపోయి సగం నష్టం వాటిల్లింది. ఇప్పుడు చేతికి వచ్చిన మామిడి పంటను కోయిద్దామంటే లాక్‌డౌన్‌ కారణంగా కూలీలు దొరకడంలేదు. ఈ నేపథ్యంలో ఈసారి తాము అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందేనని మలిహాబాద్‌కు చెందిన మామిడి రైతు మహ్మద్‌ అస్లాం ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలవల్ల గత ఏడాదితో పోలిస్తే ఈసారి పంట దిగుబడి 25 శాతం తక్కువగా వచ్చిందని, ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా కూలీలు దొరకక ఆ మాత్రం పంటను కూడా కోసుకుని అమ్ముకునే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని అస్లాంతో సహా మిగతా మమాడి రైతులు కోరుతున్నారు.