Movies

పక్షికి పఠానీ అభయం

Disha Pathani Saves An Eagle-Telugu Movies News

గాయపడిన ఓ పక్షి (గద్ద)కి వైద్య సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు హీరోయిన్‌ దిశా పటానీ. ఈ విషయాన్ని ఓ వెటర్నరీ డాక్టర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘దిశా పటానీగారు ఓ పక్షిని వెటర్నరీ క్లినిక్‌కు తీసుకువచ్చారు. అప్పటికే ఆ పక్షి రెండు రెక్కలకు బాగా గాయాలయ్యాయి. ఆ నొప్పితో పాటు డీహైడ్రేషన్‌తో కూడా ఆ పక్షి బాధపడుతున్నట్లుగా కూడా గమనించాం. ప్రస్తుతం వైద్యం చేస్తున్నాం. ఆ పక్షికి ఆర్ధోపెడిక్‌ సర్జరీ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఆ పక్షి విహంగంలో విహరించాలని కోరుకుంటున్నాం. దిశా పటానీగారి దయాగుణం మెచ్చుకోదగినది’’ అని ఆ వెటర్నరీ డాక్టర్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన దిశా ఫ్యాన్స్, నెటిజన్లు… ‘వెల్‌ డన్‌ దిశా’ అని ఈ బ్యూటీని ప్రశంసిస్తున్నారు.