వేసవి రాగానే వాతావరణం మారుతుంది. వేసవి సంబంధ వ్యాధులు ఎన్నో వస్తుంటాయి. ఇవి మామూలే కదాని వదిలేస్తాం. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. వేసవి కాలం కన్నా కరోనా కాలం అనడమే ఉత్తమం అనిపిస్తుంది. ఈ సమయంలో చిన్న విషయం అయినా అంత తేలిగ్గా తీసుకోలేం. వైరస్ సోకినా పది, పదిహేను రోజుల వరకు బయట పడదు. అందుకే ఇలాంటి చిన్న రోగాలను తరిమి కొట్టేందుకు తాటిబెల్లం చక్కని పరిష్కారం. షుగర్ వ్యాధి ఉన్నవారు సాధారణ బెల్లం కన్నా తాటిబెల్లం వాడటం మంచిదని చెబుతున్నారు. మామూలు బెల్లం కన్నా ఇది నిదానంగా రక్తంలో కలుస్తుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఇంకా ఎలాంటి ఉపయోగాలున్నాయో చూద్దాం.
– తాటిబెల్లంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
– చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటిబెల్లం ఎంతో మంచిది.
– కరోనా నేపథ్యంలో వస్తున్న దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలను తొలిగించడంలోనూ సాయపడుతుంది.
– క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
– మైగ్రేన్, బరువు తగ్గడానికి, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
– ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది.
– జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.