కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో క్రీడా టోర్నీలన్ని వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ఇప్పటికే పలు టోర్నీలు పోస్ట్‌పోన్ కాగా.. తాజాగా ఈ జాబితాలో టూర్ డి ఫ్రాన్స్ కూడా చేరింది. ఈ టోర్నీని ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించాలని అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ (యూసీఐ) పేర్కొంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 27 నుంచి జూలై 19 మధ్య జరుగాల్సిన టోర్నీని కోవిడ్-19 కారణంగా వాయిదా వేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడేంతవరకు ఈ పోటీలు నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
టూర్ డీ ఫ్రాన్స్ కూడా కరోనాకు సమర్పయామీ
Related tags :