Devotional

పాతికలక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేసిన టీటీడీ

TTD Donates 25Lakhs Meal Packets In CoronaVirus Times

ఇప్పటి దాకా 25 లక్షల ఆహార పొట్లాల పంపిణపంపిణీప్రాంతాలకూ స్వామివారి అన్నప్రసాదంలాక్ డౌన్ వల్ల తిరుపతిలో ఆగి పోయినవారు, పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులకు టీటీడీ రోజూ మధ్యాహ్నం70 వేలు, రాత్రి 70 వేల మందికి ఆకలి తీరుస్తోంది.గత నెల 28వతేదీ తిరుమలలో స్వామివారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. బుధవారం దాకా 25 లక్షల పైగా ఆహార పొట్లాలను టీటీడీ అందించింది. 28వ తేదీ తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేయించి తిరుపతికి తరలించి సరఫరా చేశారు.29వ తేదీ నుంచి తిరుపతి పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్ నుంచి అన్న ప్రసాదాల తయారీ ప్రారంభించింది.ఈ ప్రాంతం రెడ్ జోన్ లోకి రావడంతో శ్రీనివాసం వసతి సముదాయం, తిరుచానూరు అన్న దానం, తిరుపతి పద్మావతి మహిళా కళాశాల వంటశాలల నుంచి అన్న ప్రసాదాల తయారీ ప్రారంభించింది.750 మంది ఉద్యోగులు, వారిని పర్యవేక్షించే అధికారులు రెండు షిఫ్టులుగా పనిచేస్తున్నారు.మొదటి షిఫ్ట్ సిబ్బంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పని చేస్తున్నారు. రెండవ షిఫ్ట్ సిబ్బంది మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాలలోని అన్నార్థులకు ప్రభుత్వ శాఖల ద్వారా టీటీడీ అన్న ప్రసాదం పంపిణీ చేయిస్తోంది.తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ వల్ల ఇరుక్కు పోయిన వారు, పేదలు, వలస కూలీల ఆకలి తీర్చాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్ట్ నుంచి జిల్లాకు కోటి రూపాయలు చొప్పున అందిస్తున్నట్లు ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.జిల్లా కలెక్టర్లు ఈ నిధులను ఉపయోగించి ఆకలితో ఉన్న వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అందించాలని ఆయన కోరారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఈ ఓ చెప్పారు.
TTD Donates 25Lakhs Meal Packets In CoronaVirus Times
TTD Donates 25Lakhs Meal Packets In CoronaVirus Times