బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ మూగప్రాణుల్ని ఉద్దేశిస్తూ భావోద్వేగపు పోస్ట్ చేశారు. మనుషులు కొన్నాళ్ల నిర్బంధాన్ని భరించలేకపోతున్నారని, కానీ జీవితాంతం బోనుల్లో ఉంటోన్న వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బుధవారం ఆమె జూలో జంతువుల ఫొటోలను షేర్ చేస్తూ.. ‘మీరంతా ఇన్నాళ్లూ నిర్బంధంలో ఉండి విసిగిపోయారా?’ అని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్ ప్రపంచాన్ని బలవంతంగా క్వారంటైన్‌లో ఉండేలా చేసింది. ఇప్పుడు స్వీయ నిర్బంధంలో ఉండటం వల్ల ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో మనకు అర్థమైంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం, బాధ.. ఇలాంటి భావోద్వేగాలు జంతువులకు కూడా ఉంటాయి. అవీ వీటిని అనుభవిస్తాయి. ఇతరుల పరిస్థితిని స్వయంగా అనుభవిస్తే కానీ మనుషులకు వారి పట్ల జాలి, దయ రాదు. అది మన స్వభావం. బోనులో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు అర్థమైంది, ఆ బాధను అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మనతోపాటు భూమిపై ఉన్న ఇతర ప్రాణుల్ని కూడా ఇక్కడ బతకనిద్దాం, వాటితో కలిసి జీవిద్దాం’.
ఆ జంతువుల సంగతి ఆలోచించారా?

Related tags :