ఒకప్పుడు కథానాయిగా వరుస అవకాశాలు దక్కించుకున్న నటి భూమిక. వివాహం తర్వాత విరామం తీసుకున్న ఆమె రీఎంట్రీతో పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నయనతార నటించిన ‘వసంతకాలం’ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన ఆమె, ఇప్పుడు ఏకంగా అగ్ర కథానాయకుడు బాలయ్యకు విలన్‌గా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి చిత్రంలోని ఇతర పాత్రలపై దృష్టి సారించారట. ఇందులో భాగంగా ప్రతినాయక ఛాయలున్న పాత్ర కోసం భూమికను తీసుకుంటే ఎలా ఉంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని సమాచారం.
ప్రతినాయికగా భూమిక

Related tags :