కొరోనా దెబ్బకు ఇళ్లల్లో వంటింట్లో ఎక్కువ సమయం గడుపుతున్న పురుషులకు ప్రత్యేక వంటకం ఇది. రాత్రి అన్నం మిగిలిపోతే తెల్లారాక దాన్ని పారేయకుండా ఇంటిల్లిపాది ఆస్వాదించే ఓ కొత్త రకమైన గంజి అన్నం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీ విధానం:
1. చద్ది అన్నానికి గానీ అప్పుడే వండిన అన్నానికి తగినంత ఉప్పు జోడించండి.
2. సరిపడినంత నీరు పోసి మైక్రోవేవ్‌లో 3నిముషాలు పాటు వేడి చేయండి.
3. బయటకు తీసి అల్లం, ఉల్లిపాయ, మిర్చి వేసి లాగిస్తే…అదే అమృతమయమైన గంజి అన్నం.
ఈ గంజి అన్నం ద్వారా ఒకటి ఆహార వృథాను అరికట్టవచ్చు. రెండు గొంతు, శ్వాస సంబంధ రుగ్మతలకు చక్కని ఉపశమనం కూడా. ఈ వంటకం వివరాలను ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ శివరాం పంచుకున్నారు.