Business

SBI మంచి మనస్సు

SBI gives good news to its ATM customers-Telugu business news

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలు ఉండవని వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎన్నిసార్లు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్నా అదనంగా ఎలాంటి సర్వీస్‌ ఛార్జీలు ఉండబోవని తెలిపింది. ఎస్‌బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు ఉండబోవని స్పష్టంచేసింది. ఈ వెసులుబాటును జూన్‌ 30 వరకు కల్పిస్తున్నట్టు ట్విటర్‌లో వెల్లడించింది. ఏటీఎంలకు వెళ్లినప్పుడు భౌతికదూరం పాటించాలని ఖాతాదారులకు సూచించింది.