తాడేపల్లి మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం బఫర్ జోన్ లోకి వెళ్లింది.
నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు రెడ్ జోన్ అని, మూడు కిలోమీటర్ల పరిధిని క్లస్టర్ కంటైన్ మెంట్ జోన్ గా, ఏడు కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్ గా అధికారులు ప్రకటించారు.
పాజిటివ్ కేసు నమోదైన తాడేపల్లి పట్టణంలోని డోలాస్ నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి నివాసం ఏడు కిలోమీటర్ల పరిధిలోపల ఉన్నట్లు గూగుల్ మ్యాప్ ద్వారా అధికారులు గుర్తించారు.
పాజిటివ్ కేసు నమోదైన డోలాస్ ప్రాతం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో 3,982 గృహలతో పాటు 11,180 జనాభా రెడ్ జోన్ లోకి వస్తున్నట్లు వెల్లడించారు.