‘గోపాల గోపాల’, ‘అలియాస్ జానకీ’, ‘మనమంతా’ చిత్రాలతో ఆకట్టుకున్న కథానాయిక అనీషా అంబ్రోస్. గత ఏడాది గుణా జక్కాని వివాహమాడిన ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఈ విషయాన్ని ఆమె స్నేహితురాలు తేజస్వీ మదివాడ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భర్త గుణా జక్కా తన గర్భాన్ని ముద్దుపెడుతున్న ఫొటోను అనీషా అంబ్రోస్ షేర్ చేశారు. దీని గురించి అనీషా మాట్లాడుతూ ‘‘మేం చాలా లో ప్రొఫైల్‌లో ఉంటాం. నేను గర్భవతిననే విషయం నా స్నేహితురాలు తేజస్వీకి తెలిసి ఎగ్జైట్‌మెంట్‌తో బయటకు వెల్లడించింది. ఆగ్‌స్టలో డెలివరీ డేట్ ఇచ్చారు. నేను పుట్టింది కూడా అదే నెల కావడం విశేషం. ఇది నాకు చాలా కీలకమైన సమయం. ఎప్పుడూ బిజీగా ఉండే నా భర్త లాక్‌డౌన్ కారణంగా ఇంటోన్లే ఉంటున్నారు.
అనీషా అదృష్టం ఆనందం
Related tags :