NRI-NRT

బత్తినేని సోదరుల భూరి విరాళం

బత్తినేని సోదరుల భూరి విరాళం

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవాసులు బత్తినేని రాకేష్, ప్రకాష్ సోదరులు కరోనాపై పోరులో తమవంతు సాయంగా నిత్యావసర సరుకుల పంపిణీకి ₹3లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ చెక్కును తెలంగాణా రవాణా శాఖా మంత్రి పువ్వాడ్ అజయ్‌కుమార్‌కు తమ బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో సోదరులు ఇరువురితో పాటు ట్రస్ట్ చైర్మన్ బత్తినేని నాగప్రసాద్ కూడా పాల్గొన్నారు.