ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణానికి చైనాలోని గాంగ్‌ఝౌ ఎవర్‌గ్రెండ్ ఫుట్‌బాల్ క్లబ్ శ్రీకారం చుట్టింది. ఆ క్లబ్ యాజమాన్యం గురువారం స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించింది. సుమారు రూ.13 వేల కోట్లతో.. లక్ష మంది ప్రేక్షక సామర్థ్యం ఉండేలా నిర్మిస్తున్న ఈ స్టేడియం 2022 చివరి వరకూ సిద్ధం కానుంది. బార్సిలోనాలోని ప్రముఖ స్టేడియం క్యాంప్ నో కంటే పెద్దగా నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని కమలం ఆకారంలో తీర్చిదిద్దనున్నారు. దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచే దిశగా చైనా ప్రభుత్వం స్టేడియాలను నిర్మించేందుకు క్లబ్‌లను ప్రోత్సహిస్తోంది.
13వేల కోట్లతో ఫుట్‌బాల్ మైదానం
Related tags :