కరోనా స్పెషల్ వంటకాల శీర్షికలో భాగంగా నిన్న మనం గంజి అన్నం గురించి తెలుసుకున్నాం. నేడు పెసర పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందాం.
1. ముందుగా పెసరపప్పు 2గంటలు నాబెట్టాలి.
2. అల్లం, మిర్చి, కరివేపాకు సన్నగా కోసుకుని పక్కన ఉంచుకోవాలి.
3. నానబెట్టిన పెసరపప్పు నీళ్లు పారబోసి పైన కోసుకున్న ముక్కలతో మిక్సీ పట్టాలి.
4. నూనెలో చిన్న ముద్దలుగా పిండి వేసుకుంటే వేడి వేడి పెసరపునుగులు రెడీ.
—శివరాం యార్లగడ్డ