Politics

అర్ధరాత్రి ఒంటిగంటకు కూడా పనిచేసే నాయకుడు…కేటీఆర్

అర్ధరాత్రి ఒంటిగంటకు కూడా పనిచేసే నాయకుడు…కేటీఆర్

ఎర్రగడ్డలో నివసించే ఓ కుటుంబం రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ ఇంట్లో ఐదు నెలల పసికందు ఉంది. అనారోగ్య కారణాలతో చిన్నారి తల్లి కొద్దిరోజుల క్రితం చనిపోయింది. తండ్రే ఆ పాప ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు నెలరోజులుగా ఉపాధి లేకపోవడంతో పాపకు పాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించడం కష్టంగా మారింది. పక్క ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకుని గురువారం రాత్రి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణమే స్పందించిన ఆయన.. వెంటనే వెళ్లి ఆదుకోవాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ను ఆదేశించారు. కేటీఆర్‌ చెప్పిన అరగంటలోనే రాత్రి ఒంటిగంట సమయంలో ఫసియుద్దీన్‌ ఆ కుటుంబం వద్దకు వెళ్లి ఆ పాపకు కావాల్సిన పాలు, ఇతర వస్తువులతో పాటు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలను అందించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆదుకున్న కేటీఆర్‌, ఫసియుద్దీన్‌కు ఆ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పగానే ఆ కుటుంబం వద్దకు వెళ్లి సహాయం అందించిన ఫసియుద్దీన్‌ను కేటీఆర్‌ అభినందించారు.