Business

167 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ రైల్వే

167 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ రైల్వే

దేశంలో బ్రిటిషు కాలంలో భారతీయ రైల్వేలు 16 ఏప్రిల్‌ 1853 నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అప్పటి వరకు నౌకాయానం, రోడ్డు రవాణా మార్గం సాధనాలుగా ఉన్న దశలో దేశంలోనే రైలు రవాణా వ్యవస్థ కలిగి ఉండాలనే సంకల్పంతో రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ప్యాసింజర్‌ రైలు ముంబయి నుంచి థానే మధ్య నడిపించారు. నేటికి భారతీయ రైల్వే ప్రస్థానం ప్రారంభించి 167 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొట్టమొదటి రైలు ప్రారంభించిన నాడు దేశం మొత్తం సంబరాలు జరుపుకోగా నేడు రైల్వే వ్యవస్థ మొత్తం కరోనా దెబ్బతో స్తంభించి పోయిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం గూడ్స్‌ రైళ్లు మినహా ఏ ఒక్క ప్యాసింజర్‌ రైలు నడవట్లేదు.