కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని బారిన పడి చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ కట్టడికి పోరాడుతున్న స్వీడన్‌కు తన వంతు తోడ్పాటునందించేందుకు ఆ దేశ యువరాణి ప్రిన్సెస్ సోఫియా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొవిడ్-19పై పోరాడుతున్న తమ దేశ వైద్యసిబ్బందికి పలు సూచనలు ఇచ్చేందుకు ఆమె స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌లోని ఓ ఆసుపత్రిలో హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా చేరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు, నర్సులు, అధికారులపై పని భారం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుని సేవ చేసేందుకు మనకు మనమే ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆరోగ్య కార్యకర్తగా పనిచేసేందుకు రాకుమారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అయితే కొవిడ్ 19 బాధితుల విభాగానికి ఆమె నేరుగా సేవలందించరు. హెల్త్‌కేర్ నిపుణులకు వివిధ పనుల్లో తోడ్పాటునందిస్తారు.
వైద్య సేవకురాలిగా స్వీడన్ రాకుమారి
Related tags :