‘తెలుసుకొనవే చెల్లీ మగవారికి దూరంగా మగువలెప్పుడూ మెలగాలి’ అంటూ ‘మిస్సమ్మ’ సినిమాలో చెల్లి పాత్ర పోషించిన జమునకు నడవడికను వివరిస్తూ మహానటి సావిత్రి పాడిన పాట అప్పట్లో అందరి నోళ్లల్లోనూ నానింది. ‘మిస్సమ్మ’ సినిమా నాటి తరానికి మధురానుభూతి. అలాంటి సినిమాను ఇటీవల ఈటీవీ సినిమాల్లో ప్రసారం చేశారు. దీన్ని నటి జమున చూస్తూ.. అప్పటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు చలాకీగా పడుచుపిల్లలా మారిపోయి నృత్యం చేశారు. చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. 80 ఏళ్లు పైబడిన వయసులోనూ ఆకట్టుకునే హావభావాలతో జమున ఉత్సాహంగా నృత్యం చేసిన తీరు, ఆమె నవ్వు అలరిస్తున్నాయి.
మిస్సమ్మకు మిస్సమ్మ నృత్యం-[Video]
Related tags :