Business

ఎయిరిండియా గొప్ప వార్త

ఎయిరిండియా గొప్ప వార్త

ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమాన ప్రయాణాలకు మే 4 నుంచి టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. అలాగే జూన్‌ 1 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు బుకింగ్స్‌ స్వీకరిస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మే 3వ తేదీ వరకు దేశీయ ప్రయాణాలకు, మే 31 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు టికెట్లు బుకింగ్స్‌ స్వీకరించడం లేదని, అనంతరం బుకింగ్స్‌ ప్రారంభిస్తామని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం దాన్ని మే 3 వరకు పొడిగించారు. దీంతో అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఏప్రిల్‌ 14 తర్వాత కొన్ని ప్రైవేటు విమాన సంస్థలు బుకింగ్స్‌ ప్రారంభించినప్పటికీ అనంతరం నిలిపివేశాయయి. ఎయిరిండియా మాత్రం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఏప్రిల్‌ 3నే ఈ నెలాఖరు వరకు బుకింగ్స్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.