NRI-NRT

కరోనాపై పోరులో ప్రవాసులు చేతులు కలపాలి

Chandrababu Video Conference With Telugu NRTs

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విజ్ఞానం, సాంకేతిక రెండూ అనుసంధానం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రపంచంలోని తెలుగువారందరి అభిప్రాయాన్ని తెలుసుకొని, విజ్ఞానం పంచుకుందామని ఆయన పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారితో ముఖాముఖి నిర్వహించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సు కోసం తమ వంతు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి, ఎన్నో సూచనలు ఇస్తున్నా.. వినే పరిస్థితుల్లో లేదని విమర్శించారు. టచ్‌ పాయింట్స్‌ తగ్గించేందుకు ఎక్కువగా డిజిటల్‌ లావాదేవీలు జరగాలని, ఇందుకు ప్రభుత్వాల పరంగా రాయితీలు కూడా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రాష్ట్రం కోసం తోచిన సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇన్ని రోజుల లాక్‌డౌన్‌ వల్ల కొందరికి మానసిక సమస్యలు వస్తున్నాయని, వీటికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరారు. ప్రధాని కోరిక మేరకు అందరి అభిప్రాయాలు తీసుకొని, మరో నివేదిక పంపుతానని అన్నారు. చంద్రబాబుతో అమెరికా నుండి మాట్లాడిన వారిలో కోమటి జయరాం, వేమన సతీష్, లోకేశ్ నాయుడు కొణిదెల, సతీష్ మండువ, గుమ్మడి రత్నప్రసాద్, రవి వేమూరు, సాయి బొల్లిన, ఠాగూర్ మల్లినేని, విలేఖ్య, చందు నంగినేని, తదితరులు ఉన్నారు.