అగ్ర కథానాయకుడు విక్రమ్ శుక్రవారం 54వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘మహావీర్ కర్ణ’ చిత్ర బృందం అభిమానుల కోసం ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆర్.ఎస్. విమల్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా ఇది. తమిళంతో పాటు వివిధ భాషల్లో రూపొందిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన నిర్మాణ సంస్థ యునైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ నిర్మిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో భారీగా ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేష్ గోపీ దుర్యోధనుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విమల్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇందులో విక్రమ్.. కర్ణుడి గెటప్‌లో యోధుడిలా దర్శనమిచ్చారు. ఈ సినిమా కాకుండా విక్రమ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు.
విక్రమ కర్ణ
Related tags :