రామాయణం ఎంత గొప్ప కావ్యమో మనందరికీ తెలుసు. అయితే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు మాత్రం రామాయణం అంతగా కలిసి రాలేదు. రామాయణానికి సంబంధించి ఎప్పుడో 2011లో చేసిన ఓ చిన్న తప్పు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో తన అభిమానులకు దగ్గరయ్యేందుకు సోనాక్షి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వసాగింది. అయితే ఉన్నట్లుండి ఓ ట్రోలర్ ‘సంజీవని ఔషధాన్ని ఎవరు తీసుకొచ్చారు..?’ అని అడిగాడు. దీనికి సోనాక్షి కూడా వ్యంగంగా సమాధానమిస్తూ ‘రామాయణానికి సంబంధించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. దయచేసి దూరదర్శన్ లో ప్రసారమవుతున్న రామాయణం సీరియల్ చూడండి. మీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుంది’ అని జవాబిచ్చింది. చివర్లో ‘జై బజరంగభళి’ అని రాసింది. ఇంద్రజిత్తు బాణం దెబ్బతో మూర్ఛపోయిన లక్ష్మణుడిని తిరిగి బతికించేందుకు శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు సంజీవని తీసుకొస్తాడు. అంటే ఈ ప్రశ్నకు సోనాక్షి తన కామెంట్ ద్వారా సమాధానం కూడా చెప్పిందన్న మాట.
జై భరజరంగభళీ
Related tags :