Devotional

శ్రీశైలంలో సరికొత్తగా “పరోక్ష సేవ”

Sreesailam Temple Starts Paroksha Seva Online

శ్రీశైల దేవస్థానం స్వామివారికి ఆర్జితసేవలను పరోక్షంగా నిర్వహించుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించింది. స్వయంగా శ్రీశైలం రాలేని భక్తులు ఆన్‌లైన్‌ద్వారా సేవారుసుం చెల్లించి ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. పరోక్షసేవలో భాగంగా గణపతి హోమం, రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం, శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించుకోవచ్చని, ఆయా సేవలను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, వారు వీక్షించవచ్చని వెల్లడించారు. ఒక్కో పూజకు రూ.1,116 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని అన్నారు.