కరోనా వైరస్‌పై రకరకాల అపోహలు ఉన్నాయి. తాజాగా ఏసీ వాడితే కరోనా పెరుగుతుందనే అపోహ తెరపైకి వచ్చింది. కరోనా కాలంలో ఏసీలు వాడితే ఏమవుతుంది? ప‌్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఏసీలకు పని పెట్టాల్సిన రోజులివే.. కానీ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడం, చల్లని ప్రదేశాల్లో కరోనా వైరస్ ఎక్కువగా వృద్ధి చెందుతుందనే పుకార్లు ఉన్నాయి. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. PIB ఫాక్ట్ చెక్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో విండోస్ ఏసీలు వాడొచ్చుగానీ, సెంట్రల్ ఏసీలు వాడటం మంచిది కాదని తెలిపింది. పెద్ద పెద్ద సంస్థలు, ఆస్పత్రుల్లో సెంట్రల్ ఏసీలు ఉంటాయి కాబట్టి అక్కడ ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే అది మిగతా వారికి వ్యాపించే ప్రమాదం ఉందనీ అదే ఇళ్లలో అయితే కరోనా రాకుండా ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఏసీ వేసుకున్నా ఏ సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు. కరోనా చల్లదనంతో సంబంధం లేకుండా వేడిగా ఉండే దేశాల్లో కూడా వ్యాపిస్తోంది కాబట్టి ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏసీ వేసుకోమని డాక్టర్లు సూచించారు.
సెంట్రల్ ఏసీలు కరోనా సమయంలో మంచిది కాదు
Related tags :