ScienceAndTech

అవి ఫేక్ వార్తలు

అవి ఫేక్ వార్తలు

కరోనా వైరస్‌ను నియంత్రణ కోసం డీఆర్‌డీఓ అనేక నూతన ఆవిష్కరణలు చేస్తోందని ఆ సంస్థ చెర్మన్‌ సతీష్‌రెడ్డి చెప్పారు. శానిటైజర్లు, మాస్క్‌లు, వెంటిలేటర్స్‌ తయారు చేయడంతో పాటు.. నాలుగైదు లక్షల లీటర్ల శానిటైజర్ బాటిల్స్‌ పంచినట్లు తెలిపారు. ప్రతిరోజు 25 వేల ఎన్ ‌99 మాస్క్‌లను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న టెక్నాలజీని అవసరమైన పరిశ్రమలకు అందజేస్తున్నామని తెలిపారు. ఐసీయూలో పనిచేసే వైద్యుల కోసం ప్రత్యేకంగా ఫుల్‌ మాస్క్‌ కిట్లను రూపొందించామన్నారు. టెస్ట్‌ కిట్ల తయారీ ప్రయోగాలు తాము జరపడం లేదని తెలిపిన సతీష్‌రెడ్డి.. చిత్ర అనే సంస్థ దీనిపై పని చేస్తోందని పేర్కొన్నారు. అయితే తాము ఆ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.