Movies

హీరో కోటి

హీరో కోటి

సంగీత దర్శకుడు కోటి కథా నాయకుడిగా ‘సుగ్రీవ’ తెరకెక్కబోతోంది. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకుడు. ఎం.యన్‌.ఆర్‌.చౌదరి నిర్మాత. ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారుల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, కోటి పోలీసు అధికారి పాత్ర చేయబోతున్నారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళతామన్నారు.