Health

కరోనా…చైనా తయారు చేసింది!

Nobel Prize Winner Slams China For Artificially Making COVID19

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న వేళ- ఇప్పుడు అన్ని వేళ్లూ వుహాన్‌(చైనా)లోని పీ4 ల్యాబ్‌ వైపు చూపిస్తున్నాయి. వైరస్‌ పుట్టుకకు ఈ ప్రయోగశాలే వేదిక అనే వాదనలు జోరందుకున్నాయి. వైరస్‌ వ్యాప్తిలో చైనా కుట్ర కోణం ఉందన్న విమర్శలూ పదునెక్కుతున్నాయి. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నట్లుగా ఈ వైరస్‌ వుహాన్‌లోని ప్రయోగశాల నుంచే లీకయిందా? ఇది నిజంగా జీవాయుధమా? వైరస్‌ ప్రబలడంలో గబ్బిలాల పాత్ర ఎంత? చైనా చెబుతున్నట్లు వుహాన్‌లోని మాంసం విక్రయ మార్కెట్‌ దీని వ్యాప్తికి ఎంతవరకు కారణం? వైరస్‌ వ్యాప్తి నిజంగా కుట్రేనా? అలా అయితే దానిపై నిపుణులు ఏమంటున్నారు? అనేవి ఇప్పుడు ఆసక్తికర అంశాలు.

ఎందుకు అనుమానాలు?
కరోనా వైరస్‌ పేషెంట్‌ జీరోగా వుహాన్‌లోని హునాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌లో రొయ్యలు విక్రయించే మహిళను పేర్కొంటున్నారు. కానీ, ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆ మహిళకు వైరస్‌ ఎలా సోకిందో మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆ మార్కెట్లో గబ్బిలాలను విక్రయించరని ఫాక్స్‌ న్యూస్‌, ఎన్‌టీడీ మీడియా సంస్థల పరిశోధనలో తేలింది. చాలా మహమ్మారులు ప్రబలినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేషెంట్‌ జీరోను కనుగొంటుంది. ఇది ఆ మహమ్మారిపై చేసే పరిశోధనల్లో కీలకం. కానీ, కొవిడ్‌-19 విషయంలో ఇది ఇప్పటికీ సాధ్యం కాలేదు. వుహాన్‌లో గత డిసెంబర్‌ 1వ తేదీనే తొలికేసు నమోదైందని.. దానికి సముద్రజీవుల మార్కెట్‌తో సంబంధం లేదని ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ప్రచురించిన పరిశోధన పత్రం పేర్కొంది. అంటే నవంబరులోనే ఇది సోకితే.. ఇంక్యుబేషన్‌ సమయం దాటాక డిసెంబర్‌లో రోగి ఆసుపత్రికి వచ్చారన్నమాట! ఈలోపు ఆ వ్యక్తి నుంచి చాలా మందికి వ్యాపించి ఉంటుంది. తొలి 41 కొవిడ్‌ కేసుల్లో 14కు సముద్రజీవుల మార్కెట్‌తో నేరుగా సంబంధం లేదని ఈ పత్రం చెబుతోంది. డిసెంబర్‌ 10న నమోదైన మరో 3 కేసుల్లో కూడా రెండింటికి ఈ మార్కెట్‌తో సంబంధం లేదు. అంటే అప్పటికే అది అంటువ్యాధి అన్న విషయం తెలిసైనా ఉండాలి.. లేదా.. వైరస్‌ మూలం మరో ప్రదేశమైనా కావాలి. దీనికి తోడు కొవిడ్‌ రోగిని గుర్తించేందుకు తొలినాళ్లలో వారికి వుహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌తో సంబంధం ఉందేమో పరిశీలించేవారు. కానీ, తొలికేసు అక్కడ నుంచి రానప్పుడు దానిని పరిశీలించి ప్రయోజనం ఏముంది..? తర్వాత వైరస్‌ జన్యు సమాచారం బహిర్గతం చేయడంపై కూడా చైనా ఆంక్షలు విధించింది.

ఏమిటీ పీ4 ల్యాబ్‌?
అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పరిశోధనలు చేసేందుకు వుహాన్లో పీ4 స్థాయి పరిశోధనశాలను నిర్మించారు. సార్స్‌ ప్రబలిన తర్వాత ఈ ల్యాబ్‌ నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. వుహాన్‌ శివార్లలో మొత్తం 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీనిని నిర్మించారు. ఫ్రాన్స్‌కు చెందిన అలైన్‌ మెరియక్స్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. ఈ ల్యాబ్‌ను 2018లో వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందులో దాదాపు 1500 రకాల వైరస్‌లను నిల్వచేసి పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడకు విదేశాల నుంచి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను తరలించినట్లు 2019లో ఆరోపణలు వచ్చాయి. చైనాకు చెందిన డాక్టర్‌ జియాంగ్యూ క్యూని కెనడాలోని నేషనల్‌ మైక్రోబయాలజీ లేబొరేటరీ(ఎన్‌ఎంఎల్‌) నుంచి వైరస్‌, సమాచారం తరలించారనే ఆరోపణలపై వెనక్కి పంపించారు. ఎన్‌ఎంఎల్‌లో పనిచేస్తుండగానే 2017-18 మధ్యలో జియాంగ్యూ వుహాన్‌ ల్యాబ్‌కు వచ్చినట్లు తేలింది. ఆ తర్వాతే అక్కడ ఎబోలా, నిపాలపై పరిశోధనలు మొదలయ్యాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీనికి అమెరికా నుంచి ఆర్థిక సాయమూ అందింది. గతంలో పలువురు అమెరికా పరిశోధకులు దీనిని సందర్శించి వెళ్లారు. ‘బ్యాట్‌ ఉమెన్‌’ జియాంగ్‌లీ ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు.

వాస్తవాలను తొక్కిపెట్టారా?
కరోనా వైరస్‌ ప్రబలిన వెంటనే అంతర్జాతీయ పరిశోధకులను పీ4 ల్యాబ్‌కు రానివ్వకుండా చైనా కట్టడి చేయడం, ఈ వైరస్‌ గురించి సోషల్‌ మీడియాలో సమాచారం తెలిపిన వైద్యుడు వెన్‌లియాంగ్‌ను వేధించడం, సమాచారాన్ని చైనా బయటి ప్రపంచంతో పంచుకోకపోవడం.. ఇవన్నీ అనుమానాలను పెంచేశాయి. ఒక దశలో ఈ వైరస్‌ అమెరికా నుంచి వచ్చిన సైనికులు వ్యాప్తిచేశారని కూడా చైనా ప్రచారం చేసింది. ఆ తర్వాత ఈ వైరస్‌ ఇటలీ నుంచి వ్యాపించిందంటూ చైనా పత్రికలు కథనాలు రాశాయి.

కఠిన ఆంక్షలు..
షాంఘైలోని పుడాన్‌ యూనివర్సిటీకి చెందిన ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏప్రిల్‌ 10వ తేదీన చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి వచ్చిన నోటీస్‌ను పబ్లిష్‌ చేసింది. దీనిలో కరోనా వైరస్‌ పుట్టుకపై చేసిన పరిశోధనలను మూడు దశల్లో పరిశీలించి ఆమోదం తెలిపాకే ప్రచురించాలని పేర్కొంది. కలకలం రేగడంతో ఆ నోటీస్‌ను తొలగించింది. వుహాన్‌లోని చైనా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియో సైన్సెస్‌ కూడా ఇలాంటి నోటీస్‌నే జారీ చేసి తర్వాత తొలగించింది. చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నేరుగా అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటుంది. అదే సంస్థ పరిధిలో వుహాన్‌లోని పీ4 వైరస్‌ల ప్రయోగశాల కూడా ఉంటుంది.

ప్రయోగాలు చేసిన జీవుల్ని విక్రయిస్తున్నారా?
చైనాలోని ప్రయోగశాలల్లో ఉపయోగించిన జీవులను ఆ తర్వాత వధశాలల్లో విక్రయించి ఉద్యోగులు సొమ్ము చేసుకొంటారనే ఆరోపణలున్నాయి. లి నింగ్‌ అనే పరిశోధకుడు ఇలా చేసినట్లు తేలడంతో జనవరి 2న న్యాయస్థానం 12 ఏళ్ల జైలు శిక్షను కూడా విధించింది. వుహాన్లోని పీ4 ల్యాబ్‌లో ఉపయోగించిన జీవిని కూడా ఇలా మాంసపు మార్కెట్‌కు తరలించారా? అనే అనుమానాలు ఉన్నాయి. ల్యాబ్‌కు సంబంధించిన ఏ సమాచారం బయటకు పొక్కడానికి వీల్లేదని జనవరి మొదటి వారంలో ఈ ల్యాబ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉద్యోగులకు మెయిల్‌ చేసినట్లు ‘ది ఎపోక్‌ టైమ్స్‌’ పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది. కరోనా వైరస్‌ కూడా పరిశోధన శాలల నుంచి వచ్చిందన్న ప్రచారమూ జోరందుకుంది. 2016 ‘చైనా ఎక్స్‌పర్‌మెంటల్‌ యానిమల్‌ ఇన్ఫర్మేషన్‌’ ప్రకారం ఒక్క హుబే ప్రావిన్స్‌లోనే 3,00,000 జంతువులను వినియోగించి ప్రయోగాలు చేశారు.

అది ప్రయోగశాలలో పుట్టిందే..
‘‘సార్స్‌-కోవ్‌-2 జన్యుక్రమంలో హెచ్‌ఐవీ, మలేరియా పరాన్నజీవికి సంబంధించిన జన్యువులు ఉండటం అనుమానాస్పదంగా ఉంది. ఈ వైరస్‌ లక్షణాలు సహజసిద్ధంగా లేవు. వుహాన్‌ ప్రయోగశాలలో పెను ప్రమాదం జరిగింది’’