Fashion

మంగళసూత్రానికి పిన్నీసులు వేలాడదీస్తున్నారా?

మంగళసూత్రానికి పిన్నీసులు వేలాడదీస్తున్నారా?

మీ ఇంటికి… ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే… కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి… సంతాన భాగ్యానికి… సిరిసంపదలు పొందటానికి… వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి.మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. భర్తకు అనారోగ్యం, భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి.స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.