గర్భధారణ సమయంలో మహిళలకు తొడలు, రొమ్ము, పొట్టపై స్ట్రెచ్ మార్కులు ఏర్పడుతాయి. అంతేకాదు, లావుగా ఉన్నవారు ఒక్కసారిగా సన్నబడడం వల్ల కూడా ఈ గుర్తులు వచ్చే అవకాశం ఉంది. వీటిని తొలిగించేందుకు రకరకాల మందులు వాడుతుంటారు. డబ్బు ఖర్చు తప్ప వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. మధ్యలో వచ్చిన మార్పులను తొలగించడానికి ఈ కింది చిట్కాలు పాటించండి.
*** నిమ్మరసం :
స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రదేశంలో ప్రతిరోజూ నిమ్మకాయను రుద్దాలి. నిమ్మలోని బ్లీచింగ్ లక్షణాలు ఆ గుర్తులను తొలిగిస్తాయి.
*** కలబంద :
సహజ వైద్యం చేసే ఏజెంట్‌గా కలబంద పనిచేస్తుంది. చర్మంపై కలబంద జెల్‌ను పూయాలి.ఇలా చేయడం వల్ల ఇది చర్మాన్ని స్మూత్‌గా చేయడానికి ఉపయోగపడుతుంది.
*** కొబ్బరి నూనె :
కొబ్బరి నూనెతో సాగిన గుర్తులపై ప్రతిరోజూ మసాజ్ చేయడం వల్ల వాటిని వదిలించుకోవచ్చు.
*** కోడిగుడ్డు తెల్లసొన :
చర్మాన్ని తెల్లగా మార్చేందుకు గుడ్డుసొన ఉపయోగపడుతుంది. మాంసకృత్తులు, అమైనో ఆమ్లం అధికంగా ఉండటం వల్ల చర్మంపై సాగిన గుర్తును తేలికపరచడంలో సహాయపడుతుంది.
*** ఆలివ్ నూనె :
ఇందులో తేమ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి యాంటీఆక్సిడెంట్. స్ట్రెచ్ మార్కులపై ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల మచ్చలు అదృశ్యమవుతాయి.
*** బాదం నూనె :
బాదం గాని కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయాలి. సాగిన గుర్తులను తొలగించడంలో అవి ఖచ్చితంగా సహాయపడతాయి.
*** బంగాళాదుంప రసం :
క్రమం తప్పకుండా ఈ రసాన్ని స్ట్రెచ్‌మార్కులపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో పిండి పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు స్కిన్ లైటనింగ్ ఎంజైమ్‌లను కూడా కలిగి ఉంటాయి.