* మురళి కృష్ణనిలోఫర్ సూపరిండెంట్..ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 10 రోజుల డ్యూటీ తర్వాత వైద్య సిబ్బందికి క్వారంటైన్ ఇస్తున్నాంఅత్యవసర విధుల్లో ఉన్న వారికి పిపిఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు అందిస్తున్నాం..ప్రస్తుతం నిలోఫర్ లో కరోనా పాజిటివ్ పేషేంట్లు లేరు..రెగులర్ రోస్టర్ లో భాగంగానే నిలోఫర్ లో వైద్య సిబ్బందికి క్వారంటైన్..
* కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి మినహాయింపులు లేకుండానే లాక్డౌన్ కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం రేపటి(ఏప్రిల్ 20) నుంచి లాక్డౌన్ నిబంధనలను మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే లాక్డౌన్ సడలిపులపై సీఎం కేజ్రీవాల్ ఆదివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
* హైదరాబాద్‌లో కరోనా కలకలం రేపుతోంది. నాంపల్లిలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా సోకింది. మార్చి 18న మర్కజ్ వెళ్లొచ్చిన డెలివరీ బాయ్ తండ్రికి పాజిటివ్‌గా నిర్ధారించారు. తండ్రికి పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేశారు. ఆలస్యంగా యువకుడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. మార్చి 18 నుంచి 20 వరకు ఎవరెవరికి ఫుడ్ డెలివరీ చేశాడన్నదానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. విషయం బయటకి పోక్కడంతో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
* రెడ్జోన్ల పరిధిలోని ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని, పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఇది జరగడం లేదని, ఈ సమస్యే కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు అన్నారు. విజయవాడలో ఆరు రెడ్ జోన్లు ఉన్నాయి. వీటిని ఈరోజు పరిశీలించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘రెడ్జోన్లలో నివసిస్తున్న వారు ‘ఇక్కడిక్కడే కదా’ అన్న ఉద్దేశంతో నివాసాల సమీపంలో ఫ్రీగా తిరిగేస్తున్నారు. చుట్టుపక్కల పోలీసులు ఎంత గట్టినిఘా పెట్టినా ఇంటర్నల్‌గా ప్రజలు కట్టడి పాటించడం లేదు. వీధుల్లో సంచారంతో వైరస్ వేగంగా విస్తరించి కేసులు పెరుగుతున్నాయి’ అని తెలిపారు.
* రంజాన్ మార్గదర్శకాలను రిలీజ్ చేసిన కేంద్రప్రభుత్వం.మైనారిటీ శాఖమంత్రితో వక్ఫ్ బోర్డు చైర్మన్ల వీడియో కాన్ఫరెన్స్. అన్ని మసీదులకు సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ సర్కార్. సామూహిక మత సమావేశాలు, ప్రార్ధనలు, ఇఫ్తార్లకు నో పర్మిషన్.
* తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఇవాళ మరో 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బల్దియా ఓ ప్రకటనలో పేర్కొంది. వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వారికి ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి కూడా టెస్టులు చేశామని అధికారులు పేర్కొన్నారు. వారందరినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
* చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. వీరిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు మెడికల్ దుకాణాల యజమానులు సహా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ వివరాలు వెల్లడించారు. బాధితుల కుటుంబాలను క్వారంటైన్‌కు తరలించామన్నారు. తాజాగా నమోదైన కేసులతో శ్రీకాళహస్తిలో లాక్డౌన్ అమల్లో ఎలాంటి మినహాయింపులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు.
* రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, నెల్లూరులో తప్ప మిగతా జిల్లాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష ర్యాపిడ్ కిట్లు తెప్పించామని.. వీటితో మరింత వేగంగా పరీక్షలు చేయొచ్చన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల కొవిడ్ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రుల నిపుణులను బృందాలుగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని.. రహదారులపైకి రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
* భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27మంది మరణించగా మరో 1334పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,712కి చేరింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 507మంది మరణించారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 2231మంది కోలుకోగా ప్రస్తుతం మరో 12,974మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా వైరస్‌బారినపడి కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది.