రంగుల కాగితాన్ని ఒద్దికగా చుడుతూ చేసే క్విల్లింగ్ ఆర్ట్ గురించి మనకు తెలుసు కదా! పూలతల్లా అల్లుకుపోతుండే వాటి అందం మామూలుగా ఉండదు! ఇప్పుడు ఇవే ఇంకాస్త అప్‌డేట్ అయ్యి త్రీడీ బొమ్మల్లా మన ముందుకు వచ్చాయి. సాధారణ క్విల్లింగ్‌లో అట్టల వంటి వాటి ఉపరితలంపై కాగితాల ముక్కలను చుట్టలుగా చుడుతూ ఫెవికాల్‌తో అంటిస్తూ అందమైన రూపు తీసుకొస్తారు. కానీ ఇప్పుడు నేరుగా ఎలాంటి బేస్ లేకుండా అచ్చంగా కాగితపు బొమ్మలను చేసేస్తున్నారు! అంటే బొమ్మ చుట్టూరా చూడొచ్చన్నమాట. అందుకే దీన్ని త్రీడీ అంటున్నారు. కాగితంతో చేసినవంటే అదేదో సాదాసీదాగా ఉంటాయనుకుంటే పొరపాటే సుమా! భారతీయతకు అద్దం పట్టేలా.. సంప్రదాయం ఉట్టిపడేలా… చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేలా వీటిని రూపొందించి అమ్మకానికి పెడు తున్నాయి కొన్ని సంస్థలు. దేవుళ్ల బొమ్మల్లానూ తల్లీబిడ్డల ఆకారంలోనూ పెళ్లితంతు చూపుతూ… ఇలా ఎంతో విభిన్నంగా ఉంటున్నాయివి! ముద్దుముద్దుగా కనిపిస్తున్న ఇలాంటి బొమ్మొకటి హాల్లో ఉంటే… ఇంటికి అదనపు ఆకర్షణ తెస్తుందనడంలో సందేహమే లేదు కదూ!
ఈ ముద్దొచ్చే 3డీ బొమ్మలు చూశారా?
Related tags :