కరోనా వైరస్ బారినపడి ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. భారత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. అయితే కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో మాస్క్‌ల కొరత ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉండే వస్త్రాలతోనే మాస్క్‌లను తయారు చేసుకోవడం గురించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వీడియోలు చేసి చూపించారు. తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ బ్లౌజ్ పీస్, రెండు రబ్బరు బాండ్లతో మాస్క్ తయారు చేసుకోవడం గురించి ఓ వీడియోను రూపొందించి ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘ఒక పూర్తి చీరతో మనం మరెన్నో మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. హోమ్ మేడ్ మాస్క్, మన దేశం.. మన మాస్క్’ అని పేర్కొన్నారు.
జాకెట్టు ముక్కతో మాస్క్-[Video]
Related tags :