రీమేక్ సినిమాల ట్రెండ్ టాలీవుడ్లో కొనసాగుతోంది. వివిధ భాషల్లో విజయంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు అగ్రనాయకానాయికలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా కొరియన్ భాషలో పెద్ద సక్సెస్‌గా నిలిచిన ‘మిడ్నైట్న్న్రర్స్’ చిత్రం తెలుగులో రీమేక్ కానున్నట్లు సమాచారం. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రెజీనా, నివేథాథామస్ కథానాయికలుగా నటించనున్నట్లు తెలిసింది. ప్రతినాయకుడి పాత్రలో నవీన్‌చంద్ర నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కిడ్నాపింగ్ కేసును ఛేదించే పోలీస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు యువకుల కథతో కొరియన్ చిత్రం రూపుద్దిదుకున్నది. ఈ రీమేక్‌కు సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.
కొరియా కథలో…
Related tags :