కరోన covid 19 వైరస్ ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నదో, యావత్ ప్రపంచ ప్రజలు దీనికి ఏ విధముగా భయభ్రాంతులౌతున్నారో మనం చూస్తున్నాము. ఈ కరోన కారణముగ చాలా దేశాలు lockdown ప్రకటించడంతో ఎక్కడి ప్రజలు అక్కడ ఊహించని రీతిలో చిక్కుకుపోవడంతో జనజీవితం స్థంభించిపోయింది. ప్రపంచ అగ్ర దేశమైన అమెరిక పరిస్థితి దీనికి భిన్నముగ ఏమిలేదు. కరోన వ్యాప్తికి ఆ దేశం అతలాకుతలం అవుతున్న సంగతి మనకు తెలిసినదే. ఉన్నత విద్య కొరకు అమెరిక వెళ్ళిన భారతీయ విద్యార్ధులు కొందరు lockdown కారణముగ ఆర్థికసమస్యలతో పాటు పలు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి భారతీయ విద్యార్ధులకు మేమున్నాము అని థైర్యం చెబుతు, వారికి కావలసిన సహాయసహకారాలు అందిస్తున్నది, Washington లోని మన తెలుగు సంస్థ, GWTCS, Greater Washington of Telugu Cultural Society. GWTCS చేస్తున్న సహాయకార్యక్రమములో భాగంగా, April 19 ఆదివారం రోజు అమెరిక లోని భారత విద్యార్థులకు, వృద్దులకు ఉచితముగ కూరగాయలను, నిత్యావసర వస్తువులను ‘Indian spice food market’ ద్వారా అందించడము జరిగినది. Market కి వచ్చి తీసుకోలేని వారికి ఇంటికి తీసుకు వెళ్ళి మరీ అందించడము జరిగినది. ఈ కార్యక్రమము TANA past President Satish Vemana, GWTCS president Saisudha Paladugu మరియు కార్యవర్గ సభ్యులు Chandra Malavattu, Bhanu Maguluri, Krishna Lam, Srinivas Ganga, Ravi Adusumilli, Yash Battuluri And NRC Naidu పర్యవేక్షణలో జరిగింది.
కరోనా బాధితులకు GWTCS ఆపన్నహస్తం
Related tags :