కెనడాలో పోలీసు దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు సహా 16 మంది మృతిచెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక యంత్రాంగం.. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజల్ని బయటకు రావొద్దని సూచించారు. దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి, కారును కూడా పోలీసుల వాహనం వలే రూపొందించాడని అధికారులు తెలిపారు. గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. చివరి సారి 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు.
కెనడాలో…పోలీసు దుస్తుల్లో వచ్చి 16మంది హత్య
Related tags :