నిత్యానంద స్వామి.. ఈ పేరు వినగానే ఎన్నో వివాదాలు, మరెన్నో అవతారాలు.. కళ్ల ముందు కనిపిస్తాయి.. సూర్యుడిని కాస్త ఆలస్యంగా ఉదయించాలని ఆజ్ఞాపించినా ఆయనకే చెల్లింది.. సొంత దేశాన్ని సృష్టించినా.. దానికి కైలాసం అంటూ పేరు పెట్టినా ఆయనకే సాధ్యమైంది.. అంతేకాదు.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేషాలు వేస్తూ ఉంటారు నిత్యానంద.. తాజాగా, మరో కొత్త అవతారంలో దర్శమిచ్చాడు.. ఇప్పుడు నిత్యానంద వేషాలు.. లీలలకు సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. తానే పరమశివుని అవరాతం అంటూ భక్తులకు చెప్పుకుని నిత్యానంద.. ఇప్పుడు మరో వేషధారణలో అందరిని అలరిస్తున్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తిలా అలంకరించుకున్నాడు.. ఇక, ఈ వేషధారణలో ఒళ్లంతా బంగారం ధరించి. మెరిసిపోతున్న ఆయన.. తలపై కిరీటం, నుదుటిన నామాలు, ధ్యాన ముద్రలో ఉన్నట్టు కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి బంగారం మెరుపుల్లో మిలమిలా మెరిసిపోతున్నాడు నిత్యానంద..
ఈ నూతన అవతారం చూశారా?
Related tags :