ఎన్నారై తెదేపా అమెరికా విభాగం కరోనాపై పోరులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో NTR ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు చేయూతగా ₹11లక్షల రూపాయిలను సోమవారం నాడు బదిలీ చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా కరోనా నిరోధక సామాగ్రిని పంపిణీ చేయబోతున్న సందర్భంగా వాటి కొనుగోలు, సరఫరా తదితర ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని అందజేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఇదే గాక రానున్న నెల రోజుల వ్యవధిలో మరి కొంత సొమ్మును ట్రస్టుకు బదిలీ చేస్తామని, ఈ మేరకు నిధులను సేకరించే కార్యక్రమం చురుగ్గా సాగుతోందని వారు పేర్కొన్నారు.
“కరోనా యుద్ధంలో ప్రత్యక్షంగా ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి, వైద్యులకు, పారామెడికల్ మరియు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారికి చేయూతనిచ్చి వారి రక్షణకు అవసరమైన మందులు కిట్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చింది ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రవాస తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు దశలవారీగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు మొదటి విడతగా చంద్రబాబు గారి జన్మదినం సందర్బంగా ఈరోజు 11 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మహమ్మారి పై పోరాటం లో చిట్ట చివరి వరకు ఇలా దశల వారీగా తమ వంతు సాయం అందించాలని ప్రవాస తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్ణయించారు. “-NRI TDP USA