DailyDose

సత్తెనపల్లిలో వ్యక్తి హత్య. SI సస్పెండ్-TNI కథనాలు

Police Killed Muslim Guy During Lockdown Allegations - TNILIVE Corona Bulletin

* ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్బీఎంసీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో వెల్లడి170 మంది జర్నలిస్టులు, కెమేరామెన్, ఫొటోగ్రాఫర్లకు కరోనా టెస్టులుఎవరికీ కనిపించని కరోనా లక్షణాలు. టెస్టుల్లో బయటపడ్డ కరోనాచెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్

* పారదర్శకంగా కరోనా వైరస్‌ ర్యాపిడ్‌ కిట్ల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కిట్ల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా వృథా కాలేదు. దీంతో టీడీపీ చేసిన తప్పుడు ప్రచారం గుట్టురట్టు అయింది. దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున లక్ష కిట్లను దిగుమతి చేసుకుంది. అదేవిధంగా రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజ్ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది.

* సత్తెనపల్లి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పోలీసులు కొట్టడం వల్లే షేక్‌ గౌస్‌ అనే వ్యక్తి మృతి చెందాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపించిన నేపథ్యంలో ఐజీ ప్రభాకర్‌రావు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్‌ను ఆపేందుకు ఎస్సై రమేశ్‌ ప్రయత్నించారని ఐజీ చెప్పారు. అప్పటికే అతడికి చెమటలు పట్టి కిందపడిపోయాడని వివరించారు. వెంటనే సమీపంలోని ఆస్ప్రతికి తరలించారని.. అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు. ఎస్సై రమేశ్‌బాబును సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. ఇలాంటి విషయాల్లో పోలీసు సిబ్బందికి తరచుగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని వెల్లడించారు.

* మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను సడలిస్తూ కేరళ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు, బుక్‌ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు.

* క్వాటర్‌ బాటిల్‌ మద్యాన్ని రూ.1200 చొప్పున దొంగచాటుగా విక్రయిస్తున్న సినీ సహాయ నటుడిని, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి మే 3 వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో భాగంగా తమిళనాడులో టాస్మాక్‌ దుకాణాలను మూసివేశారు. దీంతో కొందరు దొంగ చాటుగా మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.

* లాక్‌డౌన్, ప్రజా రవాణా స్తంభించిన నేపథ్యంలో ప్రజలకు ఫోన్‌ ద్వారానే వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ విధానానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 14410కు గడిచిన నాలుగు రోజుల్లో 8,243 మంది ఫోన్‌ చేశారు. వీరిలో 4,732 మందికి వైద్యులు ఫోన్‌లోనే తగిన సూచనలు, అవసరమైన మందుల సమాచారం ఇచ్చారు. మరో 3491 మందికి వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ ప్రతినిధులు తిరిగి కాల్‌ చేయగా వారు స్పందించలేదు. 14410 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే డాక్టర్లు ఫోన్‌ ద్వారానే సలహాలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందుల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారమిస్తున్నారు. అక్కడ్నుంచి మందులు పేషెంటు ఇంటికే సరఫరా చేస్తారు.

* దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 36 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 17,265కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 2,546 మంది డిశ్చార్జ్‌ కాగా, 543 మంది మృతిచెందారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 14,175 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది.

* కరోనాపై పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తన వంతు సాయం అందించింది. కరోనా నియంత్రణ చర్యల కోసం బ్యాంకు తరఫున రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిసి చెక్కు అందజేశారు.

* కరోనాపై పోరుకు రాష్ట్ర చౌక దుకాణాల డీలర్ల సంక్షేమం సంఘం విరాళం ప్రకటించింది. కరోనా నియంత్రణ చర్యల నిమిత్తం తెలంగాణ సీఎం సహాయ నిధికి ఒక కోటా కమీషన్‌ డబ్బులను విరాళంగా ఇస్తున్నట్టు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాల భవన్‌లో ఆ శాఖ కమిషనర్‌ సత్యనారాయణను సంఘం ప్రతినిధులు కలిసి ఉచిత బియ్యం పంపిణీ కమీషన్‌ విడుదల చేయాలని కోరారు. తమకు నిధులు విడుదల చేయగానే కాగానే విరాళం రూ.11 కోట్లు అందజేస్తామని ప్రతినిధులు వెల్లడించారు. ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న తమకూ బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

* కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని మంత్రి కేటీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు. ఈఎస్‌ఐ, పీహెచ్‌సీలు.. ప్రైవేటు వైద్యుల సేవలు తీసుకోవాలన్నారు. సోమవారం ఆయన జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు అండగా నిలవాలి. ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించవద్దు. యాజమాన్యాలు కార్మికులకు జీతాలు చెల్లించాలి. పరిశ్రమలు 30 – 40శాతం సామర్థ్యం మేరకే నడవాలి. భౌతికదూరం అమలుపై పరిశ్రమలను అధికారులు తనిఖీ చేయాలి’’ అని సూచించారు.

* దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో భారత్‌లో 1553 కొత్త కేసులు; 36 మరణాలు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. లాక్‌డౌన్‌ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. గోవాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు లేవని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ కేసులు రెట్టింపు లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులుగా ఉండగా ఇప్పుడు 7.5గా ఉందన్నారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 2546మంది రికవరీ/ డిశ్చార్జి కాగా దీని రేటు 14.75శాతంగా ఉందని చెప్పారు.