దేశ వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. గత ఏడాది రబీలో 38.64 లక్షల హెక్టార్లల్లో పంటలు వేస్తే ఈ ఏడాది పంట విస్తీర్ణం 52.78 లక్షల హెక్టార్లకు పెరిగిందని ఆ శాఖ సమాచారమిచ్చింది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో వ్యవసాయ కార్యకలాపాలు ఆహార భద్రతకు భరోసా ఇచ్చేలా ఉన్నాయని ఆదివారం ఓ ప్రకటనలో ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ శాఖ ఇచ్చిన వివరాల మేరకు పప్పు ధాన్యాలు, ముతక తృణధాన్యాలు, నూనెగింజలు తదితర పంటల విస్తీర్ణం గత ఏడాది రబీలో 14.79 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడు 20.05 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ రబీలో వేసిన వరి పంట కోత పనులు ప్రారంభంలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన రబీ విస్తర్ణం

Related tags :