సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన నెటిజన్స్‌కు దీటైన సమాధానం చెప్పారు శ్రుతీహాసన్. ఇంతకీ ఏం జరిగిందంటే… ఇటీవల తాను పియానో వాయిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు శ్రుతి. ‘ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండకపోతే బయటకు వెళ్లి ప్రజలకు సేవ చేయవచ్చుగా’, ‘కరోనా రిలీఫ్ ఫండ్‌కు మీరు ఇంకా ఎందుకు విరాళం ఇవ్వలేదు?’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారట. ఈ విషయంపై శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘కరోనా సమయంలో ఎందుకు ప్రజలకు సేవ చేయడం లేదని కొందరు నా కామెంట్ బాక్స్‌లో స్పందించారు. నన్ను చేయమని చెప్పేవారు ప్రజలకు ఏ మాత్రం సేవ చేస్తున్నారో నాకు తెలియదు. కరోనా కారణంగా మనందర్నీ ఇంట్లోనే ఉండమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే అంత దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు అనే మాటలను నమ్మే వ్యక్తిని నేను. నాకు విరాళం ఇవ్వాలనిపిస్తే తప్పక ఇస్తాను. అంతేకానీ అది ఇతరుల ఆదేశానుసారంగా జరగాలనుకోను. గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
నాకనిపిస్తే ఇస్తా…నీకెందుకు?
Related tags :