కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. 2021, జులైకి వాయిదా పడ్డాయి.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వచ్చే సంవత్సరం కూడా ఈ మెగా ఈవెంట్ జరిగే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు జపాన్ వైరస్ నిపుణులు. ‘‘కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ జరిగేలా కనిపించడం లేదు. రాబోయే వేసవి కల్లా జపాన్ కరోనాను నియంత్రించొచ్చు. కానీ ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ ఈ వ్యాధి బారి నుంచి బయటపడతాయని చెప్పలేం. ఒలింపిక్స్ అంటే అన్ని దేశాలూ పాల్గొనాల్సిన పెద్ద క్రీడా సంబరం’’ అని జపాన్ ప్రొఫెసర్ కెంటారో ఇవాటా చెప్పాడు. ఇవాటా మాత్రమే కాక ఇటీవల ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవి శ్రీధర్ కూడా వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానం వ్యక్తం చేసింది. ‘‘కరోనాకు త్వరగా టీకా కనిపెడితే తప్ప ఒలింపిక్స్ గురించి ఆలోచించలేం. ఏదైనా ఈ టీకాపైనే ఆధారపడి ఉంది. ఒలింపిక్స్ వాయిదా అనేది ఐవోసీకి బాధాకరమే’’ అని దేవి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ ఈ సంవత్సరం జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వచ్చే ఏడాది జులై 23-ఆగస్టు 8 తేదీలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
టీకా లేకుంటే టోక్యోలో ఆటలు ఉండవు
Related tags :