తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడు విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. తనను భారత్‌కు అప్పగించరాదంటూ మాల్యా చేసుకున్న పిటిషన్‌ను అక్కడి హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ తీర్పుపై బ్రిటన్ సుప్రీంకోర్టుకు అపీలు చేసుకునేందుకు 14 రోజుల గడువిచ్చింది. సుప్రీం కోర్టుకు మాల్యా అపీలు చేసుకుంటే అక్కడ తీర్పు వెలువడే వరకూ ఆయన అప్పగింతపై బ్రిటన్ అంతర్గత వ్యవహారాల విభాగం వేచిచూస్తుంది. అపీలు చేసుకోని పక్షంలో భారత్-బ్రిటన్ మధ్య గల నేరస్థుల అప్పగింత ఒప్పందం మేరకు 28 రోజుల్లో మాల్యా అప్పగింతకు తగిన చర్యలు తీసుకోనుంది. తాజా తీర్పును గొప్ప పురోగతిగా సీబీఐ అభివర్ణించింది.
మాల్యాకు కోర్టు ఝలక్…ఇండియాకు తిరిగిరావచ్చు
Related tags :