రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షకు వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోన్న నేపథ్యంలో జిల్లాల్లో పర్యటించాలని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను కేసీఆర్ ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్ అమలు తీరు, కంటైన్‌మెంట్ జోన్లపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమీక్ష
Related tags :