Movies

కీర్తి ఆఫర్

కీర్తి ఆఫర్

హీరో మహేశ్‌బాబుతో కథానాయిక కీర్తీ సురేష్‌ జోడీ కట్టనున్నారా? అంటే అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయనే సమాధానం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్‌ను ఒక కథానాయికగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. కీర్తి నటించిన తాజా చిత్రాలు ‘గుడ్‌లక్‌ సఖి, మిస్‌ ఇండియా, పెంగ్విన్‌’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. లాక్‌డౌన్‌ అయ్యాక ఈ చిత్రాలు తెర మీదకు వస్తాయి. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘అన్నాత్తే’, నితిన్‌ ‘రంగ్‌ దే’ చిత్రాలు కీర్తి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమా ఆఫర్‌ కూడా ఉంటే లాక్‌డౌన్‌ తర్వాత ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌తో కీర్తి బిజీగా ఉంటారు.