‘ఒక మనసు’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు మెగా వారసురాలు నిహారిక కొణిదెల. ఆపై ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సుర్యకాంతం’లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఆశించిన విజయం తీసుకురాలేదు. 2019లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో చిన్న పాత్రలో కనిపించిన ఆమె తన కొత్త చిత్రాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. మరోపక్క వెబ్‌సిరీస్‌లను కూడా నిర్మిస్తున్నారు. తాజాగా నిహారిక యాంకర్ రవితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పెళ్లి తర్వాత కూడా నటించడం గురించి ముచ్చటించారు. ‘నేను సమంత కాదు. కాబట్టి పెళ్లి తర్వాత నటిస్తానా? నటించలేనా? అనే విషయాన్ని ముందుగానే చెప్పలేను. కాబట్టి నాకు ఎక్కువ సమయం లేదు. వీలైనంత వరకు ఇప్పటి నుంచి నా వద్దకు వచ్చిన మంచి ఆఫర్లను వదిలిపెట్టకుండా నటిస్తా’ అని అన్నారు. అనంతరం రొమాంటిక్ సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ… ‘గ్లామరస్ పాత్రలు కూడా పోషించబోతున్నా. నా తర్వాతి తమిళ ప్రాజెక్టు రొమాంటిక్ చిత్రంగా రూపుదిద్దుకోబోతోంది. గోవాలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఈ సినిమా కోసం గోవా బీచ్‌లో రొమాంటిక్ సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నాం’ అని ఆమె చెప్పారు.
పెళ్లి తర్వాత నటన?
Related tags :