ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరికొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్-19 ప్రతాపం భవిష్యత్‌పై మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ గేబ్రియసస్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా ప్రభావం మానవవాళిపై చాలా తీవ్రంగా ఉంటుంది. వైరస్ తీవ్రతలో కేవలం కొద్దిశాతం మాత్రమే మనం చూశాము. దీని ప్రభవం మానవ భవిష్యత్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. వైరస్ తీవ్రత చాలామంది ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. 1918లో వచ్చిన స్ఫానిష్ ఫ్లూ కంటే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ముందుముందు చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొక తప్పదు. కరోనాను కట్టడి చేయకపోతే వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు’ అని అన్నారు. కాగా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. వైరస్ నియంత్రణకు అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌ను మాత్రం అదుపుచేయలేకపోతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 25 లక్షలకు చేరింది. మరోవైపు మరణల సంఖ్య 1 లక్ష 65వేలుగా నమోదైంది. ఇక వైరస్ తీవ్రత అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ అదుపులోకి రావడంలేదు. ఒక్క అమెరికాలోనే వైరస్ కారణంగా 41,000 మంది ప్రాణాలు విడిచారు.
అసలైన కరోనా పండుగ ముందుంది-WHO
Related tags :