విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో పింఛను చెల్లించాలని ఏపీ సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. మార్చినెలకు సంబంధించి వారికి సగం పింఛనే చెల్లించడం సరైన నిర్ణయం కాదన్నారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వానికి సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల పట్ల ఈ తరహా చర్య సబబు కాదని ఆక్షేపించారు. పెన్షనర్లకు చెల్లించే పింఛనులో ఎలాంటి కోత విధించరాదని చట్టం స్పష్టం చేస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. పెన్షన్ అందుకునే వారంతా 60ఏళ్లు పైబడిన వారేనని.. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వీరికి వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పారు. తక్షణమే విశ్రాంత ఉద్యోగులకు 100 శాతం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పూర్తి పింఛను ఇవ్వండి
Related tags :