ScienceAndTech

ధరిత్రి దినోత్సవం….దరిద్ర దినోత్సవం అయిపోతోంది

Climate Change Ruining Earth's Health-Do Your Part On Earth Day

ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. 1970 లో మొదటి ధరిత్రి దినోత్సవం జరుపుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో జరుపుకుంటారు. పారిశ్రామిక వల్ల కాలుష్యం ఎక్కువ అవుతుందని 1970 లలో పర్యావరణ ఉద్యమం యునైటెడ్ స్టేట్స్లో జరిగింది. ఈ ఉద్యమం తారా స్థాయికి చేరింది. కాలుష్యం నివారణకు ప్రభుత్వం అప్పుడు నియమాలను రూపొందించింది. దీని ఫలితంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. తరువాతి ప్రపంచవ్యాప్తంగా భూ పరిరక్షణలో మానవుని పాత్రపై అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలు చేశారు.ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇవ్వబడింది. అదేవిధంగా, భూమి రక్షణ కోసం చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.