అన్ని రకాల వలసలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఇవాళే సంతకం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు, దేశంపై కరోనా వైరస్ చేస్తున్న అదృశ్య దాడిని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అంతకుముందు తెలిపారు. ఇది 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. 60 రోజుల తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమెరికా పౌరుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవాళ సంతకం. 60రోజుల నిషేధం.
Related tags :