కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకోసం నిరంతరం పనిచేస్తున్న వారిని ప్రభుత్వం గౌరవిస్తుందని తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా నియంత్రణలో విశిష్ట సేవలందిస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సిబ్బందికి పూర్తి వేతనంతో పాటు ప్రోత్సాహకాలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని గుర్తుచేశారు. నగరంలోని సంజీవయ్య పార్కు ఎదురుగా ఉన్న డీఆర్‌ఎఫ్ శిక్షణా కేంద్రంలో శానిటేషన్, డీఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. లాక్డౌన్ సమయంలో వైద్యులు, పోలీసులకు దీటుగా పనిచేస్తున్నారని వారిని అభినందించారు.
పారిశుద్ధ్య కార్మికులకు వడ్డన చేసిన కేటీఆర్
Related tags :